: బ్యూటీషియన్ శిరీష కుమార్తె దీప్తికి లోటు రానివ్వను.. నేను చదివిస్తాను!: ఏపీ సీఐడీ ఐజీ
గత నెలలో హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష కుమార్తె దీప్తికి ఏ లోటూ రాకుండా చూసుకుంటానని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఐజీ సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ ఉదయం దీప్తి చదువుకుంటున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఆదిత్యా విద్యాలయంకు వచ్చిన ఆయన, ఈ సంవత్సరం విద్యకు అవసరమైన మొత్తానికి ఆయన చెక్కును అందించారు. దీప్తి డిగ్రీ పూర్తి చేసే వరకూ అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని ఈ సందర్భంగా సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆ పాపకు తల్లి లేని లోటు రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చదువులో ప్రతిభ చూపాలని దీప్తిని కోరారు.