: అడిగిన వెంటనే అన్నం పెట్టలేదని.. భార్యను కాల్చి చంపిన భర్త


అడిగిన వెంటనే అన్నం పెట్టలేదని ఓ భర్త తన భార్యను తుపాకితో కాల్చి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న కవి నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. స‌ద‌రు భ‌ర్త తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, మన్‌సరోవర్ పార్క్ కాలనీలో నివ‌సిస్తోన్న‌ అశోక్‌కుమార్(60), సునైన దంపతులకు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. బాగా తాగి వ‌చ్చిన అశోక్‌కుమార్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అనంత‌రం భోజనం పెట్ట‌మ‌ని చెప్పాడు. ఆమె భోజ‌నం పెట్ట‌డం ఆల‌స్యం చేస్తోంద‌ని కాల్పులు జరిపాడు. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేకుండా పోయింది. ఆమె అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు తెలిపారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. కాగా, అతని వ‌ద్ద ఉన్న తుపాకీ ఎక్క‌డిదో తెలియాల్సి ఉంది.          

  • Loading...

More Telugu News