: కాగ్ ను తక్కువ అంచనా వేస్తున్నారు... ఇక అంతే!: చంద్రబాబుకు ఉండవల్లి హెచ్చరిక
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఏపీ ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందని, కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఇందుకు ఏ రోజుకైనా సమాధానం చెప్పాల్సి వుంటుందని కాంగ్రెస్ మాజీ నేత, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయమై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరిన ఆయన, పట్టిసీమ నిధుల్లో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని కాగ్ తన రిపోర్టులో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు పట్టిసీమ ప్రాజెక్టే నిరుపయోగమని, అటువంటి దానికి వందల కోట్లను నీళ్లల్లా ఖర్చు చేశారని, కాగ్ తప్పులను ఎత్తి చూపినా సరిదిద్దు కోవడం లేదని ఉండవల్లి దుయ్యబట్టారు.