: 'సంక్షేమంపై 97 శాతం ప్రజలు హ్యాపీ' అన్న సెర్ప్ సీఈఓ... ఆపై చంద్రబాబు ప్రశ్నకు అవాక్కు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటి వివరాలను సీఎం ముందు ఉంచిన వేళ, ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెన్షన్ల విషయంలో 97 శాతం మంది లబ్దిదారులు సంతోషంగా ఉన్నారని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందని సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణమోహన్ చంద్రబాబుకు తెలిపారు.

ఆ వెంటనే చంద్రబాబు స్పందిస్తూ, "మిగతా మూడు శాతం అసంతృప్తిగా ఎందుకున్నారు? వంద శాతం రావాలిగా?" అని ప్రశ్నించడంతో ఒకింత అవాక్కయిన కృష్ణమోహన్, 97 శాతం హ్యాపీగా ఉన్నారని చెబితే, ఆనందంతో మెచ్చుకుంటారని భావించామని, మూడు శాతం గురించి అడగటం అన్యాయమని అమాయకంగా సమాధానం ఇచ్చారట. ఇక కృష్ణమోహన్ సమాధానంతో చంద్రబాబు సైతం కాసేపు నవ్వుతూ ఉండిపోయారట.

  • Loading...

More Telugu News