: డియర్ అనురాగ్.. భారత్ క్రికెట్ కు నీ అవసరం ఉంది!: గంగూలీ


బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మళ్లీ భారత క్రికెట్లో తనదైన పాత్ర పోషించాలని ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. ఇటీవలే గంగూలీ 45వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా గంగూలీకి ట్విట్టర్ ద్వారా అనురాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. యువ క్రికెటర్లకు నీవు మరింత ఆదర్శంగా ఉండటానికి ఇది సరైన తరుణమని ఆయన కోరాడు.

దీనికి సమాధానంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన అనురాగ్ కు గంగూలీ ధన్యవాదాలు తెలిపాడు. 'థాంక్యూ అనురాగ్. నీవు మళ్లీ క్రికెట్లోకి రావాలి. నీ అవసరం భారత క్రికెట్ కు ఉంది' అంటూ రీట్వీట్ చేశాడు. లోథా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంలో అనురాగ్ ఠాకూర్ వెనకడుగు వేయడంతో... అతన్ని బీసీసీఐ పదవి నుంచి సుప్రీంకోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన బీసీసీఐకు దూరమయ్యాడు.

  • Loading...

More Telugu News