: బిలాస్ పూర్ ఎక్సై ప్రెస్ లో గ్యాస్ సిలెండర్ల లీక్... బెంబేలెత్తి పరుగులు తీసిన ప్రయాణికులు
బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో గ్యాస్ లీక్ కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ట్రైన్ రేణిగుంట చేరుకునే సరికి గ్యాస్ లీకైన వాసన వచ్చింది. దీంతో జనరల్ బోగీల్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. దీంతో ట్రైన్ ను ఆపేశారు. నాలుగు కేజీల బరువుండే చిన్న సిలెండర్లను ఛత్తీస్ గఢ్ ప్రయాణికులు జనరల్ బోగీలో తమవెంట తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సిలెండర్లు లీక్ కావడంతో ప్రమాదం జరుగుతోందని భావించి పరుగులు తీశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, సిలెండర్లు తీసుకెళ్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రైన్ బయల్దేరింది.