: చైనా దౌత్యవేత్తతో సమావేశ వార్తలను ఖండించిన రాహుల్ గాంధీ కార్యాలయం


భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇండియాలో చైనా దౌత్యవేత్త లువో ఝాహుయ్ తో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారన్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అలాంటి సమావేశం ఏదీ జరగలేదని స్పష్టం చేసింది. చైనా దౌత్యవేత్తతో రాహుల్ భేటీ అయ్యారని.... భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డోక్లాం ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మోహరింపుపై చర్చించారని సీఎన్ఎన్ న్యూస్18 ఛానల్ ప్రసారం చేసింది. ఈ వార్తలను రాహుల్ కార్యాలయం కూడా ఖండించింది. 

  • Loading...

More Telugu News