: ఆ అమ్మాయి రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చింది: టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా
తాను వ్యక్తిగతంగా తెలుగుదేశం ఎమ్మెల్యే అనితను ఎన్నడూ తిట్టలేదని, తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పెట్టించేందుకు చంద్రబాబు అనితను పావుగా వాడుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. "అనితను నేనెప్పుడూ తిట్టలేదు. ఆమెను ప్రెస్ వాళ్లు ఎంకరేజ్ చేస్తున్నారు. రోజాను తిట్టడానికి ఓ ఎస్సీ అమ్మాయి అయితే, రాంగ్ గా దాన్ని ట్రీట్ చేయవచ్చని చూస్తున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడొచ్చింది రాజకీయాల్లోకి. నేను 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ప్రతి అంశంమీద పోరాడాను. ప్రతి మహిళా సమస్య గురించి నేను మాట్లాడగలుగుతున్నాను. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం నాకేంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అన్యాయం చేస్తున్నారు కాబట్టే మాట్లాడుతున్నా" అని అన్నారు.