: పండంటి పాపకు జన్మనిచ్చిన బ్రిటన్ యువకుడు!


అవును, మీరు చదివింది నిజమే!
బ్రిటన్‌ కు చెందిన హేడెన్‌ క్రాస్‌ (21) పండంటి పాపకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పాడు. పుట్టుకతోనే స్త్రీ అయిన హేడెన్‌ లింగమార్పిడి చేయించుకుని మూడేళ్ల క్రితం పురుషుడిగా మారాడు. ఇందుకు సంబంధించిన హార్మోన్ల చికిత్స చేయించుకున్నాడు. దీంతో భవిష్యత్ లో బిడ్డను కనే అవకాశం లేదని, ముందుగానే బిడ్డను కనేందుకు వీలుగా ఎవరైనా వీర్యదానం చేయాలని ఫేస్ బుక్ లో కోరగా, ఒక వ్యక్తి ముందుకు వచ్చి, వీర్యదానం చేశాడు. దీంతో హెడెన్ గర్భందాల్చాడు. అప్పట్లో ఇది ఆసక్తికర చర్చను రాజేసింది.

అనంతరం జూన్‌ 16న గ్లోసెస్టేర్‌ రాయల్‌ ఆసుపత్రిలో హేడెన్‌ పండంటి పాపకు జన్మనిచ్చాడు. ఆ పాపకు 'పైగే' అని పేరు కూడా పెట్టాడు హేడెన్. పురుషుడిగా మారిన తరువాత గర్భందాల్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడని బ్రిటన్ మీడియా చెబుతోంది. అయితే, ఈ విషయంలో కాస్త వివాదం తలెత్తింది. పురుషుడిగా మారిన తరువాత తండ్రి అయిన తొలి వ్యక్తి హేడెన్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ప్రపంచంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన పురుషుడిగా అమెరికాకు చెందిన థామస్‌ బెయిటీ పేరిట ఇప్పటికే రికార్డు వుంది. వీర్యదాత ద్వారా గర్భం దాల్చిన థామస్‌ కు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు.

  • Loading...

More Telugu News