: జగన్ పాదయాత్ర కాదు.. జైలు యాత్ర చేస్తారు: బోండా ఉమ వ్యంగ్యం
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్ర కాదు, జైలు యాత్ర చెయ్యాల్సి వస్తుందని ఆ పార్టీ వర్గాలే అనుకుంటున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం కోసం జగన్ ఆరాటపడుతున్నారని, సాధ్యం కాని హామీలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే టీడీపీని కాదని, స్వలాభం కోసం పని చేసే జగన్ ను ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు. కాగా, తమ పార్టీ అధికారంలోకి వస్తే 9 కార్యక్రమాలు చేపడతానంటూ వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన హామీలు అమలుకు సాధ్యం కావని బోండా ఉమ విమర్శించారు.