: మా తాత ఆరో తరగతి, డాడీ ఎనిమిదో తరగతి ఫెయిలయ్యారు.. నేను టెన్త్ పాసయ్యాను!: రణ్ బీర్ కపూర్


తన తాత ఆరో తరగతి, డాడీ ఎనిమిదో తరగతి ఫెయిలయ్యారని, తాను మాత్రం పదో తరగతి పాసయ్యానని బాలీవుడ్ ప్రముఖ నటుడు, రిషీ కపూర్ తనయుడు రణ్ బీర్ కపూర్ అన్నాడు. రణ్ బీర్ కపూర్ నటించిన ‘జగ్గా జాసూస్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా పిల్లలతో రణ్ బీర్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారితో తన చిన్ననాటి విషయాలను రణ్ బీర్ చెప్పుకొచ్చాడు. తాను చదువులో వెనుకబడినా తమ కుటుంబంలో మాత్రం చదువుకున్నవాడిని తానొక్కడినేనని, తాను పదోతరగతిలో 56 శాతం మార్కులతో పాసయ్యానని చెప్పాడు.

చిన్నప్పుడు తనకు ఎప్పుడూ మార్కులు తక్కువ వచ్చేవని, మంచి మార్కులు తెచ్చుకుంటానని ప్రతిసారి తన తల్లికి చెప్పి తప్పించుకునేవాడినని చెప్పాడు. ప్రోగ్రెస్ రిపోర్టులో రెడ్ మార్క్ కనిపిస్తే తన తండ్రికి చెబుతానని తన తల్లి బెదిరించేదని, దీంతో, తాను ఏడ్చేసేవాడినని చెప్పాడు. అయితే, అప్పట్లో, ట్విట్టర్ లేకపోవడంతో బతికిపోయానని, లేకపోతే, తన మార్కుల గురించి ట్విట్టర్ లో ఏవేవో రాసేవారని రణ్ బీర్ కపూర్ చెప్పాడు.

  • Loading...

More Telugu News