: ఠారెత్తిస్తున్న టమాట... సెంచరీ కొట్టేసింది!


హైదరాబాదులో ఇప్పుడు కిలో టమాట రూ. 100. బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా రెట్టింపై టమాట ధర ప్రజలకు చుక్కలు చూపుతోంది. నగరంలోని మెహిదీపట్నం రైతుబజార్ లో రూ. 70 దాటిన కిలో ధర, బహిరంగ మార్కెట్ లో కొన్ని చోట్ల రూ. 120కి కూడా చేరింది. ఈ నెల 1వ తేదీన రూ. 40 వద్ద, 3వ తేదీన రూ. 60 వద్ద ఉన్న టమాట ధర, వారం తిరక్కుండానే రెట్టింపైంది.

దిగుబడి తగ్గడం, సరఫరా లేకపోవడంతోనే టమాట ధరలు గణనీయంగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం కేవలం 70 క్వింటాళ్ల టమాట మాత్రమే రైతుబజార్ కు వచ్చిందని, అందువల్లే ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో బెంగళూరు, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాట దిగుబడి రానుందని, ఆపై ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News