: అనూహ్య ఘటన... చొరవగా వచ్చి మోదీతో మాట కలిపిన ట్రంప్!
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య జీ-20 సమావేశాల ముగింపు రోజున అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వచ్చి మాటలు కలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా లేచివచ్చి, ప్రధాని మోదీతో ముచ్చటించారని, దీంతో ఇతర నాయకులు కూడా వారి వద్దకు చేరారని, ఇవి గుర్తుంచుకోదగ్గ గొప్ప క్షణాలని, భారత్ తరఫున ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిగా హ్యాంబర్గ్ వెళ్లిన నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ పనగారియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ట్రంప్, మోదీల సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఆయన పంచుకున్నారు.