: సెన్సేషనల్ రెస్పాన్స్.. ‘జై లవకుశ’ కొత్త సినిమా టీజర్‌కి అప్పుడే కోటి వ్యూస్: ఎన్టీఆర్ ఆర్ట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తారక్ నటిస్తోన్న ‘జై లవకుశ’ సినిమా టీజర్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్‌కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోందని ఎన్టీఆర్ ఆర్ట్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కేవలం 48 గంటలల్లోపే కోటి డిజిటల్ వ్యూస్‌ను దాటేసిందని, ఈ టీజర్ గత రికార్డులను బద్దలు కొట్టేస్తోందని పేర్కొంది. ఈ టీజర్‌కు ఇంతగా ఆదరణ చూపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొంది.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘జై లవకుశ’ సినిమాపై ఈ టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ టీజర్ ను పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. మొదటిసారిగా రావణుడిలా నెగిటివ్ పాత్రలో కనపడుతున్న ఎన్టీఆర్ ఆహార్యం ‘అదుర్స్’ అంటూ కితాబిస్తున్నారు. ఎన్టీఆర్ డైలాగ్ లు వదిలిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.