: 'అవినీతి చక్రవర్తి' పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్.. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లాలని సూచన


వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత జగన్ 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగులో ఈ పుస్తకాన్ని 'చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి.. 3,75,008 కోట్లు' అనే పేరుతో విడుదల చేశారు. పది తలలతో ఉన్న చంద్రబాబు కాసుల సంచులను పట్టుకుని ఉన్న బొమ్మను పుస్తకం మీద ముద్రించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్ల కాలంలో చేసిన అవినీతిని ఆధారాలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచామని తెలిపారు.

ఈ మూడేళ్లలో అక్షరాల 3 లక్షల 75 వేల కోట్ల రూపాయల కుంభకోణాలను చంద్రబాబు చేశారని ఆరోపించారు. ఇందులో రాజధానిలోనే భూముల పేరిట లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. మరో లక్ష కోట్లు విశాఖలోని భూముల కుంభకోణమని చెప్పారు. దాదాపు 30 వేల కాపీలను ప్రింట్ చేశామని... ప్లీనరీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పుస్తకాన్ని అందజేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలోకి ఈ పుస్తకాన్ని తీసుకెళ్లాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 

  • Loading...

More Telugu News