: మా ముందు మీ సైన్యం ఎంత?.. దక్షిణ కొరియాను ముక్కలు ముక్కలుగా చేస్తాం: కిమ్ జాంగ్ ఉన్


ప్ర‌పంచ దేశాలు హెచ్చరిస్తున్న‌ప్ప‌టికీ దూకుడుగా ముందుకు వెళుతూ అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌లు జ‌రుపుతున్న ఉత్త‌ర‌ కొరియా త‌మ ప్ర‌త్య‌ర్థి దేశం దక్షిణ కొరియాపై మ‌రోసారి మండిప‌డి, తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా ద‌క్షిణ కొరియా మీడియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ఉత్త‌ర‌ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ తాము ద‌క్షిణ కొరియాను ఏ మాత్రం లెక్క‌చేయ‌బోమ‌ని, అగ్ర‌రాజ్యం అమెరికాపైనే యుద్ధానికి సిద్ధ‌మైన తాము ద‌క్షిణ కొరియాను ముక్క‌లు ముక్కలుగా చేయ‌గ‌ల‌మ‌ని అన్నారు.

ఇటీవ‌లే ఉత్త‌ర‌ కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం) ప‌రీక్ష‌ను విజయవంతంగా పరీక్షించామని ప్ర‌క‌ట‌న చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఉత్త‌ర‌ కొరియా ఉద్దేశమేంటని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అడిగారు. దానికి కిమ్ జాంగ్ ఉన్ స్పందిస్తూ ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా ఎదురు ప్ర‌శ్న వేశారు. 'మా సైన్యం ముందు ద‌క్షిణ కొరియా సైన్యం ఏపాటిది?' అంటూ ఆ దేశ సైన్యం త‌మ‌ను ఎదుర్కోవ‌డానికి ఎందుకూ ప‌నికిరాద‌న్న‌ట్లు మాట్లాడారు.

  • Loading...

More Telugu News