: రైల్వే విశ్రాంతి గదిలో కత్తిపట్టుకుని యువకుడి వీరంగం


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ రిటైరింగ్ రూంలో కత్తిపట్టుకుని యువకుడు వీరంగం వేశాడు. పది గంటల సమయంలో కత్తితో రిటైరింగ్ రూంలో దూరిన యువకుడు అక్కడున్న అందర్నీ కత్తితో పొడిచేస్తానని బెదిరించి బయటకు పంపించాడు. అనంతరం తలుపు గడియపెట్టుకుని  బంధించుకున్నాడు. లోపలకు ఎవరైనా వస్తే పొడిచేస్తానని చెబుతున్నాడు. సుమారు 2 గంటలుగా ఆ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనతో ఉన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికులు కిటికీలోంచి సదరు యువకుడితో చర్చలు జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News