: బాలయ్య 'ఎన్టీఆర్' సినిమాపై తారక్ స్పందన!


మహా నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నట్టు వస్తున్న వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఎన్టీఆర్ ఒక కుటుంబానికి చెందిన ఆస్తి కాదనేది తన ప్రగాఢ నమ్మకమని... యావత్ తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీయడమంటే... తెలుగువారి బయోపిక్ తీయడమేనని చెప్పాడు. తాతయ్య బయోపిక్ లో బాబాయ్ బాలయ్య నటించడం అద్భుతమని అన్నాడు. ఆ సినిమాలో మీరు కూడా నటిస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా... ఆ విషయం గురించి ఏమీ తెలియదని చెప్పాడు.

మరోవైపు, ప్రముఖ దర్శకుడు వర్మ కూడా ఎన్టీఆర్ సినిమాను తీస్తానని... అందులో పలు వివాదాస్పద అంశాలు ఉంటాయనే ప్రకటనకు సంబంధించిన ప్రశ్నపై స్పందిస్తూ... దాని గురించి తనకు ఏమీ తెలియదని, ఆ సినిమా వచ్చేంత వరకు ఏమీ చెప్పలేనని తెలిపాడు. బిగ్ బాస్ షో లాంచ్ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తారక్ పైవిధంగా స్పందించాడు.

  • Loading...

More Telugu News