: స్కూల్‌కి బాయ్... ట్విట్టర్‌కు హాయ్: మలాలా యూసుఫ్ జాయ్
చిన్నవయసులోనే నోబెల్ శాంతి బహుమతి సాధించిన మలాలా యూసుఫ్ జాయ్ పాఠశాల చదువు పూర్తైంది. సోషల్ మీడియా లైఫ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. `హాయ్ ట్విట్టర్` అంటూ తన మొదటి ట్వీట్ చేసి, `ఇవాళ నా పాఠశాల చివరి రోజు... ట్విట్టర్‌లో మొదటి రోజు` అంటూ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆరు ట్వీట్లు చేసింది. `హైస్కూల్ చదువు పూర్తవడం సంతోషం, బాధ రెండింటిని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అమ్మాయిలు బడికి వెళ్లలేకపోతున్నారని నాకు తెలుసు. అలాంటి వారిని కలవడానికి వచ్చేవారం నేను మధ్యప్రాచ్య, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో `గర్ల్ పవర్ ట్రిప్` నిర్వహించబోతున్నాను. విద్య, సమానత్వం కోసం చేసే పోరాటంలో మీరందరూ నాతో చేయి కలుపుతారు కదా?` అనేది మలాలా ట్వీట్ల సారాంశం.