: ఇలాగైతే జగన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాం: సీబీఐ ప్రత్యేక కోర్టు


అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ నిన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, పార్టీ ప్లీనరీకి సంబంధించిన సమావేశాల కారణంగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాలేక పోయారు. దీంతో, జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కోర్టు విచారణ ఉన్న సంగతి ముందే తెలుసు కదా? అని జగన్ తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఏవో పనులు, మీటింగ్ లు ఉంటాయని... అంత మాత్రాన కోర్టు విచారణకు హాజరు కాలేమని చెబితే... కోర్టు విచారణ ఎలా ముందుకు సాగుతుందని అడిగారు. కోర్టు హాజరుకు మినహాయింపును కోరడానికి ఇది సరైన కారణం కాదని ఆయన అన్నారు. అయినా, పార్టీ ప్లీనరీ రేపు ఉన్నప్పుడు, ఈ రోజు కోర్టుకు రావడానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని... లేకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News