: పాక్ క్రికెటర్ మంచి మనసు.. ప్రధాని ఇచ్చిన రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించిన యూనిస్ ఖాన్


ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్న పాక్ క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాని నవాజ్ షరీఫ్ రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. దానిని అందుకున్న క్రికెటర్ యూనిస్ ఖాన్ ఆ మొత్తాన్ని ఈద్ ఫౌండేషన్‌కు ఇస్తున్నట్టు ప్రకటించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ‘‘ఈ బహుమతి అందించిన ప్రధానికి కృతజ్ఞతలు. ఈ మొత్తాన్ని నేను ఈద్ ఫౌండేషన్, ఇండస్ ఆసుపత్రి, సిటిజన్స్ ఫౌండేషన్‌లకు విరాళంగా ఇస్తున్నా’’ అని ప్రకటించాడు. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. చాంపియన్స్ ట్రోఫీలో గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నవాజ్ షరీఫ్ జట్టు సభ్యులకు నగదు బహుమతులు అందజేశారు.

  • Loading...

More Telugu News