: మంద కృష్ణ అబద్ధం చెప్పారు.. సభకు అనుమతి లేదు: డీజీపీ సాంబశివరావు


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు ఈ రోజు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కురుక్షేత్ర మహాసభకు షరతులతో కూడిన అనుమతి ఉందని మంద కృష్ణ అబద్ధం చెప్పారని అన్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ సభకు అనుమతి విషయమై పరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించే ఈ సభకు అనుమతి ఇవ్వలేదని డీజీపీ చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఆందోళన చేసినవారిపై కేసులు పెడతామని, ఎవరినీ వదిలిపెట్టబోమని, అందరిపైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నాగార్జున యూనివర్శిటీ, ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో రేపు మధ్యాహ్నం వరకు బందోబస్తు కొనసాగుతుందని సాంబశివరావు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News