: సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం.. నిమిషంలో 3 లీటర్ల కూల్ డ్రింక్ తాగాడు!
సోషల్ మీడియాలో పాప్యులారిటీ సంపాదించుకోవడం కోసం యువత ఎన్నో సాహసాలు చేస్తోంది. ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా పలు రకాల ప్రయత్నాలు చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని, అందిరికీ తమ గురించి తెలిసేలా చేసుకుంటున్నారు. తాము చేస్తోన్న ప్రయత్నం సరైనదా? కాదా? అని కూడా చూసుకోకుండా తమ సాహసాన్ని రికార్డు చేసేస్తున్నారు.
తాజాగా ఓ యువకుడు ఏకంగా లీటర్ల కొద్దీ కూల్ డ్రింక్ ను గటగటా తాగేసి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకునేలా చేశాడు. ఒక నిమిషం 7 సెకండ్లలో సుమారు 3 లీటర్ల కూల్ డ్రింక్ ను తాగాడు. గత నెలలో చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక బాటిల్ తరువాత మరో బాటిల్ తీసుకుని కూల్ డ్రింక్‌ను ఎలా తాగుతున్నాడో మీరూ చూడండి...