: గంగా, యమున నదులకు ఆ హోదా ఇవ్వడం సరికాదు: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
దేశంలో తొలి జీవించి ఉన్న ప్రాణి గంగానదేనని ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ నదితో పాటు, యమునకు కూడా ఆ హోదా లభించింది. దీంతో గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత పెరుగుతుందని కొందరు భావించారు. అయితే, ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ రోజు దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆ నదులు జీవం ఉన్న ప్రాణులు కావని స్పష్టం చేసింది. గంగ, యమునా నదుల వల్ల మానవజాతి వర్థిల్లుతున్నదన్న విషయం నిజమేనని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. వాటిపై ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని మాత్రం జీవం ఉన్న వ్యక్తుల హోదాను ఇవ్వలేమని తెలిపింది.