: ఐదేళ్లలోపు పిల్లలుంటే, ప్రత్యేక శ్రీవారి దర్శనం: టీటీడీ ఈఓ


చంటిబిడ్డల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయిస్తున్న టీటీడీ, మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నెలలో రెండు రోజుల పాటు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకూ చిన్న పిల్లల తల్లిదండ్రులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఏడాదిలోపున్న చంటిబిడ్డల పేరెంట్స్ కు రోజూ ప్రత్యేక దర్శన అవకాశం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ఈ నెల 15, 25 తేదీల్లో రోజుకు 4 వేల మందికి దర్శన అవకాశాన్ని కల్పించనున్నట్టు సింఘాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News