: ఓ 'జ్యోతిలక్ష్మి' కథ... వేశ్యావాటికలో పుట్టిన ప్రేమ!


ఆమధ్య చార్మి ప్రధానపాత్రలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' చిత్రం గుర్తుందా? అచ్చు ఆ సినిమాలోలానే న్యూఢిల్లీలోని జీబీ రోడ్డు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ చొరవతో సుఖాంతమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఢిల్లీలో డ్రైవర్ గా పని చేసుకుంటున్న 28 సంవత్సరాల యువకుడు, ఓ వేశ్యావాటికకు వెళ్లి 27 ఏళ్ల యువతిని కలిశాడు. ఆమె ఉపాధి కోసం నేపాల్ నుంచి ఇండియాకు వచ్చి వ్యభిచారిణిగా మారింది. విటుడిగా వెళ్లినప్పటికీ, తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు యువకుడు.

ఆపై తరచూ ఆమె కోసం వచ్చి వెళ్లాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. దీంతో తమకు సాయం చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ ను సదరు యువకుడు ఆశ్రయించడంతో, వారు పోలీసుల సాయంతో దాడులు చేసి ఆమెకు విముక్తిని కల్పించారు. అతి త్వరలో వీరిద్దరికీ వివాహం జరిపించనున్నామని ఈ సందర్భంగా స్వాతి మలివాల్ వెల్లడించారు. జీబీ రోడ్డుల్లోని ఇరుకు గదులలో సాగుతున్న వ్యభిచారదందాను అడ్డుకునేందుకు మరిన్ని దాడులు చేయనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News