: బతికే ధైర్యం, బతకాలన్న సంకల్పం మనకు ఉన్నాయా?: ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదంపై ట్రంప్ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలిచి, బతికే ధైర్యం పాశ్చాత్య దేశాలకు ఉందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు జర్మనీలోని హ్యాంప్ షైర్ కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా పోలండ్ దేశ రాజధాని వార్సాను ఆయన నిన్న సందర్శించారు. క్రసిన్ స్కీ స్వేర్ లో ప్రజలను ఉద్దేశించి ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
ఈ ఉగ్రవాద శకంలో బతికే ధైర్యం కానీ, బతకాలన్న సంకల్పం కానీ మనలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. మన నాగరికతను కాపాడుకోవాలన్న తపన, ధైర్యం మనకు ఉన్నాయా? అని అడిగారు. ఉగ్ర భూతాన్ని అంతం చేయడానికి అందరం ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.