: శిరీష లోదుస్తుల మరకలపై స్పష్టత ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో అత్యంత కీలకమైన ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె ధరించిన ప్యాంటీపై కొన్ని మరకలు ఉన్నాయని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నప్పటి నుంచీ ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానాలు బలపడగా, అటువంటిదేమీ లేదని ఈ నివేదిక తేల్చింది.

శిరీష లోదుస్తులపై ఉన్న మరకలు ఆహారపు మరకలేనని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. వీర్యానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లూ లభించలేదని పేర్కొన్నారు. కాగా, ఈ రిపోర్టుతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని, తనపై అత్యాచారయత్నం జరగడంతో, నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసు వర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.

  • Loading...

More Telugu News