: సాయంకాలం.. సాగరతీరం: కాళ్లకు చెప్పులు లేకుండా, ప్యాంటు పైకెత్తి పట్టుకుని...: మోదీ సరదాలు


నరేంద్ర మోదీ భారత ప్రధాని, నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధాని. ఈ ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వెళ్లిన వేళ, తమ హోదాలను పక్కనబెట్టి, చిన్నపిల్లల్లా మారిపోయారు. కాళ్లకు చెప్పుల్లేకుండా సముద్ర తీరంలో కాసేపు సరదాగా విహరించారు. మోదీ తన ప్యాంటు తడవకుండా పైకెత్తి పట్టుకుని మరీ నీటిలో ఉత్సాహంగా అడుగులు వేశారు. వారిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళుతుంటే, దూరంగా ఉన్న కెమెరాలు క్లిక్ ల మీద క్లిక్ లు కొట్టాయి.

ఇక సముద్రతీర విహారం అనంతరం మోదీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, స్నేహితులతో కలసి సముద్ర తీరానికి వెళ్లడానికి మించిన ఆనందం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. ఇక కాళ్లకు చెప్పుల్లేకుండా తామిద్దరం ఉన్న ఫోటోను పెద్దది చేయించి మోదీకి గిఫ్ట్ గా ఇచ్చిన నెతన్యాహూ, "మీ చారిత్రాత్మక పర్యటనలో మన స్నేహానికి గుర్తుగా..." అని దానిపై ఆటోగ్రాఫ్ చేశారు. వారిద్దరూ బీచ్ లో వున్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News