: దలైలామా చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి: కత్రినా కైఫ్
ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామాను బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్ కలిసింది. ఈ రోజు తన 82వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాను విమాన ప్రయాణంలో అనుకోకుండా కలుసుకున్నట్టు కత్రినా తెలిపింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఓ ఫొటోను కత్రినా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా దలైలామా చెప్పిన మాటలు తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొంది. ఇంతకీ, దలైలామా ఆమెతో ఏం చెప్పారంటే.. ‘మనిషి.. డబ్బు కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాడు. మళ్లీ అదే డబ్బుతో తిరిగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. వర్తమానాన్ని సంతోషంగా గడపకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాడు..’ అని చెప్పారట.