: నితీష్ కుమార్ ను పల్లెత్తు మాట అనొద్దు: కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్
మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో జత కట్టి.. ప్రస్తుతం ఎన్డీఏకు మద్దతు పలికిన బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తమ పార్టీ నేతలెవ్వరూ ఘాటు వ్యాఖ్యలు కానీ, విమర్శలు గానీ చేయవద్దని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించినట్టు తెలుస్తోంది. నితీష్ ను పల్లెత్తు మాట అనవద్దని తమ పార్టీ వర్గీయులకు రాహుల్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఎన్డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కే నితీష్ మద్దతు ప్రకటించడం, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన మీరాకుమార్ ఓడిపోవడం ఖాయమంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.ఈ నేపథ్యంలోనే నితీష్ ను టార్గెట్ చేస్తూ వారు విమర్శలు చేశారు.