: పశ్చిమ బెంగాల్ రూ.60,000 కోట్లు చెల్లించాల్సిందే... సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సిక్కిం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సిక్కిం సర్కార్ సీరియస్ అయింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నో ఏళ్ల నుంచి గుర్ఖాలాండ్ ప్రజలు ప్రత్యక రాష్ట్రం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఎన్నోసార్లు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ప్రాంతానికి పక్కనే ఉన్న సిక్కింకి ఆ ఉద్యమం వల్ల ఎంతో నష్టం జరిగింది. తమ రాష్ట్రానికి 60 వేల కోట్ల మేర ఆదాయం నష్టం జరిగిందని ప్రకటించిన ఆ రాష్ట్ర సర్కార్... దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 32 ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం జరుగుతోందని పేర్కొన్న సిక్కిం ప్రభుత్వం.. వారు రోడ్లపైకి వచ్చిన ప్రతిసారి తమ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని తెలిపింది. దీంతో ఇన్నాళ్ళుగా తమకు ఇంత నష్టం వచ్చిందని తెలిపింది.