: వైపీపీలో చేరనున్న హీరో నాగార్జున?
సినిమాలు, వ్యాపారాలతో బిజీబిజీగా ఉండే ప్రముఖ సినీ నటుడు నాగార్జున రాజకీయ ప్రవేశం చేయబోతున్నారే వార్తలు జోరందుకున్నాయి. వైసీపీలోకి నాగ్ వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లేదా విజయవాడ నుంచి నాగ్ కు జగన్ సీట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. వైయస్ కుటుంబంతో ఇంతకు ముందు నుంచే నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డితో ఆయన చాలా చనువుగా ఉండేవారు. వైయస్ హయాంలో ప్రభుత్వ పథకాలకు నాగార్జున ఫ్రీగానే ప్రచారం నిర్వహించారు. అంతేకాదు, జగన్ సన్నిహితులు కొంతమందితో నాగ్ కు వ్యాపార భాగస్వామ్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.