: ఆ సినిమా విడుదలయ్యాక నాపై చెప్పులు విసురుతారనుకున్నా: హీరోయిన్ ఇలియానా


సుమారు పదకొండు సంవత్సరాల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ చిత్రం ద్వారా అందాల సుందరి ఇలియానా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పోకిరి, కేడీ, ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట, జల్సా, భలేదొంగలు, కిక్ తదితర తెలుగు చిత్రాల్లో ప్రముఖ హీరోల సరసన నటించింది. కన్నడ, తమిళ చిత్రాలతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ ఇలియానా నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ముబారక్’, ‘బాద్షాహో’ హిందీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ, ‘దేవదాసు’లో తనకు అనుకోకుండా నటించే అవకాశం లభించిందని, అప్పుడు తన వయసు పదిహేనేళ్లని చెప్పింది. నిజం చెప్పాలంటే, అమెరికా ట్రిప్ కు ఉచితంగా వెళ్లొచ్చని అప్పుడు తన మనసులో అనుకున్నానని చెప్పింది. అప్పుడు తనకు తెలుగు, హిందీ భాషలు మాట్లాడటం రాదని, సెట్స్ లో ఇంగ్లీషు భాషలోనే మాట్లాడే దానినని పేర్కొంది. ‘దేవదాసు’ సినిమా విడుదలైన తర్వాత, ప్రేక్షకుల స్పందన చూసేందుకు చిత్రయూనిట్ తో కలిసి థియేటర్ కు వెళ్లామని.. తన నటన నచ్చక ప్రేక్షకులు తనపై చెప్పులు విసురుతారేమోనని అనుకున్నానని, కానీ, తన నటన ప్రేక్షకులకు నచ్చడంతో సర్ ప్రైజ్ అయ్యానని ఇలియానా చెప్పుకొచ్చింది. కాగా, తనకు పదిహేనేళ్ల వయసు నుంచే ఇలియానా మోడలింగ్ చేసింది.

  • Loading...

More Telugu News