: తమ్మినేని వీరభద్రంను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఉద్రిక్తత


హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప‌రిస‌రాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఈ క్రమంలో త‌మ డిమాండ్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌ల‌వడానికి ర్యాలీగా వెళుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆందోళ‌న‌కారులు నినాదాలు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు, జాన్‌ వెస్లీ కూడా ఉన్నారు. అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.            

  • Loading...

More Telugu News