: రవితేజ సోదరుడు భరత్ మృతికి కారణాలేంటో తెలిపే ఎఫ్ఎస్ఎల్ నివేదిక నేడు బయటకు!
జూన్ 24వ తేదీన ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన హీరో రవితేజ సోదరుడు భరత్ మృతికి కారణాలేంటన్న విషయమై మరింత సమాచారం నేడు వెల్లడి కానుంది. భరత్ యాక్సిడెంట్ పై ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పోలీసుల చేతికి రానుంది. ప్రమాదం జరిగిన సమయంలో భరత్ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అన్న విషయం కూడా ఈ నివేదికతో బహిర్గతం కానుంది. కాగా, ఆయన కారులో సగం ఖాళీ అయిన వోడ్కా బాటిల్ లభ్యమైన సంగతి తెలిసిందే. ఒక వేళ భరత్ డ్రగ్స్ తీసుకుని కారును నడుపుతూ ఉండివుంటే, ఆ విషయం కూడా ఎఫ్ఎస్ఎల్ బయటపెట్టనుంది.