: హైదరాబాదు పాతబస్తీలో దారుణం... తప్పు బయటపడుతుందని బాలుడి హత్య!


హైదరాబాదులోని పాతబస్తీలో గల బార్కాస్ లో దారుణం చోటుచేసుకుంది. గత నెల 28న హైదరాబాదులోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలుడు మిస్సైనట్టు కేసు నమోదైంది. దీంతో పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బంధువులు, తెలిసినవారు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీకి ప్రయత్నించినా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో, సీసీ పుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఊహించని విషయాన్ని గుర్తించారు. 11 ఏళ్ల బాలుడిని 16 ఏళ్ల మరో బాలుడు హతమార్చాడని గుర్తించి షాక్ తిన్నారు. బార్కాస్ లోని స్కూల్ గ్రౌండ్ లో ఆడుకునేందుకు 11 ఏళ్ల బాలుడు మధ్యాహ్నం వచ్చాడు. అతడితో పక్కనే పాన్ షాప్ లో పని చేసే 16 ఏళ్ల బాలుడు ఆడుకున్నాడు.

ఈ సమయంలో బాలుడికి చాక్లెట్ల ఆశ చూపి, సాయంత్రం ఆరుగంటల సమయంలో బాలుడిపై లైంగిక దాడి చేశాడు. బాధతో విలవిల్లాడిన బాలుడు తన తండ్రికి చెబుతానని బెదిరించాడు. దీంతో ముందు బాలుడి తలను గోడకేసి బాదిన 16 ఏళ్ల బాలుడు, తరువాత రాడ్ తో తలపై దాడి చేసి చంపేశాడు. తరువాత శవాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసిన బాలుడు... తన సోదరి వివాహం ఉండడంతో త్వరగా వెళ్లాలన్న ఆలోచనతో స్కూల్ పైనున్న వాటర్ ట్యాంక్ పక్కన దాచాడు. మూడు రోజుల తరువాత శవం బరువుగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఆ పరిసరాల్లోని సుమారు వంద సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించిన పోలీసులు బాలుడు వేసుకున్న దుస్తుల ఆధారంగా కేసును ఛేదించారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News