: ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి రూ.20 వేలు ఖర్చయిందట!: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కాకిలెక్కలు!
ఎలుకల నిర్మూలన కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రి ఏకంగా రూ.60 లక్షలను ఖర్చుచేసింది. ఆ ఆసుపత్రిలో ఎలుకలు అధికంగా ఉన్నాయని, రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదువుతూనే ఉంటాం. ఆ ఎలుకలన్నింటినీ పట్టుకోవడానికి ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్కు అధికారులు పనులు అప్పగించారు. 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు కేవలం 300 ఎలుకలను పట్టుకోవడానికి మొత్తం రూ. 60 లక్షలు ఖర్చు అయిందట. లెక్కలు వేస్తే ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి అయిన ఖర్చు రూ. 20 వేలు అన్నమాట. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును కొందరు పంచుకుతిని ఇలా లెక్కలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.