: మంగళసూత్రంలో పగడం ధరించడం మంచిది కాదంటూ కర్ణాటకలో పుకార్లు!
మంగళసూత్రంలో పగడం ధరించడం మంచిది కాదని, భర్త ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే పుకార్లు కర్ణాటకలో జోరుగా వ్యాపించాయి. దీంతో, తమ తాళిబొట్లలోని పగడాలను మహిళలు పగలకొట్టుకుంటున్నారు. పగడం ధరిస్తే రాత్రుళ్లు నిద్రపట్టదని, మంచిది కాదని, భర్త చనిపోతాడనే పుకార్లు బళ్లారి, దావణగేరి, చిత్రదుర్గ, తుమ్కూరులో కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో, మహిళలు తమ తాళిబొట్లలో ఉన్న పగడాలను పగలగొట్టుకోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.