: 'హాహాహా శామ్... థ్యాంక్యూ వదిన గారూ’ అంటూ సమంతకు అక్కినేని అఖిల్ ట్వీట్!


ఇటీవ‌ల జ‌రిగిన‌ సైమా అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేదిక‌పై అక్కినేని అఖిల్ తన కొత్త సినిమాలోని ఓ పాట పాడి అందరినీ అల‌రించాడు. అఖిల్ అంత అద్భుతంగా పాడ‌గ‌ల‌డ‌ని తెలుసుకున్న అభిమానులు అంతా ఆయ‌న‌ను ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. అఖిల్ టాలెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌లేక‌పోయిన స‌మంత తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ సారీ చెప్పింది. తాను అఖిల్ ప‌ర్ఫార్మెన్స్ ను చూడ‌లేక‌పోయినందుకు బాధ‌ప‌డిపోయింది. స‌మంత ట్వీట్‌కు స్పందించిన‌ అఖిల్.. ‘హాహాహా శామ్‌! థ్యాంక్యూ వదిన గారు’ అని ట్వీట్ చేశాడు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఈ సంభాష‌ణ అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది.   

  • Loading...

More Telugu News