: బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న బుజ్జి ఏనుగు!
చిన్నపిల్లలు తమ మొదటి అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. మరి అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల అడుగులు వేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఆ అనుభూతి కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుట్టిన కొద్ది సేపటికే, తల్లి సాయం తీసుకుంటూ అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న ఈ గున్న ఏనుగు వీడియోను చూసి నెటిజన్లు సంబరపడుతున్నారు. కింద పడుతూ లేస్తూ అడుగులు వేసేందుకు మళ్లీ మళ్లీ నిలబడుతున్న ఈ ఏనుగు పిల్ల వీడియోను బోట్సువానా అడవిలో ఫొటోగ్రాఫర్ గ్రాంట్ అట్కిన్‌సన్ తీశారు.