: చంద్రబాబుకు మహిళల ఉసురు తగులుతుంది: రోజా
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన తెలుగుదేశం ప్రభుత్వం... తాగుబోతు ప్రభుత్వంలా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. జాతీయ రహదారుల పక్కన లిక్కర్ షాపులు ఉండకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినా ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చేయడం లేదని... వైన్ షాపుల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు-మీరు కార్యక్రమం తరహాలో నీరు-బారు కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. మెడికల్ షాపుల్లో కూడా బీరు అమ్మేలా ఉన్నారని అన్నారు. చంద్రబాబుకు మహిళల ఉసురు తప్పకుండా తగులుతుందని అన్నారు. మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ ప్లీనరీలో మద్యం పాలసీపై తమ అధినేత జగన్ ప్రకటన చేస్తారని చెప్పారు.