: ఎమ్మెల్యే రోజాను 'డేరింగ్ అండ్ డాషింగ్' అన్న వెంకయ్యనాయుడు!
ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన ఆయన, పార్క్ హయత్ హోటల్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలను రామ్ నాథ్ కు పరిచయం చేసే క్రమంలో ముందుగా, నగరి ఎమ్మెల్యే రోజాను పరిచయం చేశారు. అయితే, ఇదే సమయంలో రామ్ నాథ్ వెంటే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ‘షి ఈజ్ డేరింగ్ అండ్ డాషింగ్, యాక్టివ్ ఉమన్ ఇన్ పాలిటిక్స్’ అని రోజా గురించి వ్యాఖ్యానించారు. దీంతో, రోజా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.