: సహరి వివాహానికి వేళాయె... 'ఈనాడు' రామోజీరావు ఇంట మొదలైన పెళ్లి సందడి!
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ పెద్ద కుమార్తె సహరి వివాహం ఈ నెల 28న రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందగా, కిరణ్ స్వయంగా కేసీఆర్ దంపతులను తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. మూడు రోజుల పాటు జరిగే పెళ్లి వేడుకల్లో భాగంగా, పలు కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది.
ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ సహా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు హాజరవుతారని తెలుస్తోంది. ఇక తన ఇంట చాలా సంవత్సరాల తరువాత జరుగుతున్న వేడుక కావడంతో, మనవరాలి వివాహాన్ని గుర్తుండిపోయేలా జరిపించాలని రామోజీరావు భావిస్తున్నట్టు తెలుస్తోంది.