: అసదుద్దీన్ ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?: శివసేన నాయకురాలు మనీషా
హిందూ, ముస్లింల మధ్య ఎంఐఎం సోదరులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు చిచ్చు పెడుతున్నారని శివసేన నాయకురాలు మనీషా కాయందీ మండిపడ్డారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటునే కాకుండా, ప్రధాని మోదీని కూడా అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని... ఆయనపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లను పెంచుకోవడానికే ఒవైసీ సోదరులు విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒవైసీ సోదరులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని... తక్షణమే వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.