: ఖమ్మంలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!
ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బర్త్ డే పార్టీ ఉందని చెప్పిన మోసపు మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన ఆ విద్యార్థినిపై తోటి విద్యార్థులు నలుగురు అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. అంతేకాదు, ఆ విద్యార్థిని నగ్న దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. కాగా, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో వారు సెకండ్ ఇయర్ చదువుతున్నారు.