: కారు ఇంజన్ లో హ్యాండ్ గ‌న్స్.. పట్టుబడ్డ నిందితులు!


హ్యాండ్ గ‌న్స్ అక్రమ రవాణాకు నిందితులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పసుపు పచ్చ మెర్సిడీస్‌ కారు ఇంజన్ లో అమర్చిన ప్రత్యేక భాగంలో ఈ తుపాకులను దాచిపెట్టి వేరే దేశానికి తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ సంఘటన ఫ్రాన్స్ లోని  కాక్‌వెల్లస్‌లో జరిగింది. ఇద్దరు అనుమానిత వ్యక్తులు  4ఎంఎం, 6ఎంఎం హ్యాండ్‌గన్స్ మొత్తం 79 హ్యాండ్‌గన్స్ ను  అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వాహనం బ్రిటన్‌కు చెందినదిగా గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు.  

ఫ్రాన్స్‌ను, బ్రిటన్‌ ను కలిపే చానెల్‌ సొరంగంలోకి ప్రవేశించే సమయంలో క్రాస్‌ బోర్డర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు ఈ మేరకు సమాచారం అందడంతో వారిని అడ్డుకొని తనిఖీలు నిర్వహించామన్నారు. ఫ్రాన్స్‌ నుంచి వాటిని లండన్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుల పేర్లు జానుజ్‌ మైచెక్‌, డెనిస్‌ కొలెన్స్‌కోవ్‌ అని, చెక్‌ రిపబ్లిక్ కు చెందిన వారిగా వారిని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News