: రాష్ట్రపతి ఎన్నిక తర్వాత నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడొచ్చు: మంత్రి అఖిలప్రియ
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ఏపీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారని అన్నారు. నంద్యాలకు చెందిన ఐదుగురు సర్పంచ్ లు, ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మండలానికో ఇన్ చార్జ్ అప్పుడే వద్దని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, నంద్యాల టీడీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సమక్షంలో యాభై మంది కార్యకర్తలు సొంతగూటికి చేరారు.