: బాధపడకండి మిత్రులారా: బీజేపీ ఎమ్మెల్యేకు దీటుగా జవాబిచ్చి బదిలీ అయిన పోలీసు అధికారిణి


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇటీవ‌ల పోలీసు అధికారిణి శ్రేష్ఠా ఠాకూర్ అక్క‌డి బీజేపీ నేతల తీరు ప‌ట్ల ఘాటుగా స్పందించి బుద్ధి చెప్పిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. సోష‌ల్ మీడియాలో అంతా ఆమెను ఆడ సింగం అంటూ కొనియాడారు. అయితే, ఇటీవ‌ల చేసిన పోలీసు అధికారుల బ‌దిలీల్లో భాగంగా ఆమెను కూడా అక్క‌డి నుంచి వేరే చోటుకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ప్ర‌స్తుతం ఆమె బహ్రైచ్‌లో విధులు నిర్వ‌హిస్తోంది.

తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. త‌న‌ను నేపాల్‌ సరిహద్దు ప్రాంతమైన బహ్రైచ్‌కి బదిలీ చేశారని, త‌న గురించి ఎవ్వ‌రూ బాధపడకూడ‌ద‌ని, తాను సంతోషంగానే ఉన్నాన‌ని తెలిపారు. తాను చేస్తున్న మంచి పనికి ఇదో రివార్డ్‌గా భావిస్తానని అన్నారు. త‌న అభిమానులంతా బహ్రైచ్‌కి ఆహ్వానితులేన‌ని ఆమె పేర్కొన్నారు. దీపం ఎక్కడుంటే అక్కడ వెలుగు నిండుతుందని, దీపానికి సొంత ఇల్లు అంటూ ఉండదని ఆమె పోస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News