: ధోనీ కెరీర్ లో అత్యంత 'నత్త' రికార్డు!


పరుగులు చేసేందుకు ఏ మాత్రమూ అనుకూలించని పిచ్ పై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఎంతగా కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. నిన్న విండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో తన కెరీర్ లోనే అత్యంత నిదానంగా ఆడుతూ, 50 పరుగులు చేసేందుకు 108 బంతులు తీసుకున్న ధోనీ, గత 16 సంవత్సరాల్లో భారత ఆటగాళ్లు చేసిన అత్యంత స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశాడు.

తక్కువ లక్ష్యం (190 పరుగులు) కావడంతో ఎన్ని బంతులు తిన్నా విజయం సాధ్యమని అభిమానులు ధైర్యంగానే ఉన్న సమయంలో 49వ ఓవర్ లో ధోనీ అవుట్ కావడంతో, ఆపై కఠినమైన పిచ్ పై పరుగులు రాబట్టే వారు లేక, భారత్ ఆలౌటైంది. ఇటీవలి కాలంలో ఇంత తక్కువ స్కోరు చేసి గెలిచిన జట్టు వెస్టిండీస్ మాత్రమే కావడం గమనార్హం. నత్త నడకను తలపిస్తూ, ఓపికగా ఆడిన ధోనీ ఇన్నింగ్స్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. తన కెరీర్ లో అత్యంత నిదానంగా ఆడిన 'నత్త' ఇన్నింగ్స్ గా ఈ స్కోరు నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News